Saturday, June 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత విత్తనాలను పంపిణీ చేసిన సర్పంచ్

ఉచిత విత్తనాలను పంపిణీ చేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
రైతు అభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని మేనూరు గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందించే పెసర, మినుము, కంది పంట విత్తన బ్యాగులను శనివారం ఆయన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి అందించే విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -