38.95 లక్షల మంది చిన్నారులకు పోలియో
చుక్కలు పంపిణీ
రాష్ట్రంలో 95.1 శాతం పూర్తి
నేడు, రేపు డోర్ టూ డోర్ క్యాంపెయిన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం జయప్రదమైంది. రాష్ట్రంలో 0-5 ఏండ్ల లోపు పిల్లలు 40,97,749 మంది ఉంటారని అంచనా వేయగా, అందులో 38,95,550
మంది (95.1 శాతం)
చిన్నారులకు తొలి రోజే పోలియో చుక్కల పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూత్‌లకు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించడం పట్ల హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సహకారం, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా సాగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించామని కమిషనర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా 99 శాతం కవరేజ్‌తో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా, భద్రాద్రి కొత్తగూడెం 98.9 శాతం, మెదక్ 98.6 శాతం, ములుగు, వనపర్తి జిల్లాలు 98.2 శాతం, జయశంకర్ భూపాలపల్లి 98.1 శాతం కవరేజ్ సాధించాయి. హైదరాబాద్ జిల్లాలో 93.1 శాతం పూర్తయింది. ఆదివారం నాడు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యశాఖ బృందాలు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచనల మేరకు ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. ఐదేండ్లలోపు ప్రతి చిన్నారికి కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లి దండ్రులకు కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
పల్స్‌పోలియో విజయవంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



