Tuesday, June 30, 2026
E-PAPER
Homeజాతీయం6వ తరగతి బ్యాచ్‌ ‌నుంచి త్రి భాషా సూత్రం అమలు

6వ తరగతి బ్యాచ్‌ ‌నుంచి త్రి భాషా సూత్రం అమలు

- Advertisement -

7,8,9 తరగతులకు త్రిభాషా సూత్రాన్ని సడలించిన సీబీఎస్‌ఈ
వారు రెండు విదేశీ భాషలను కొనసాగించవచ్చునని స్పష్టీకరణ

న్యూఢిల్లీ : నూతన విద్యావిధానం అమలులో భాగంగా ఆరో తరగతి నుండి పూర్తి స్థాయిలో త్రీ భాషా విధానం అమలు చేస్తామని సీబీ ఎస్‌ఈ స్పష్టం చేసింది. సోమవారం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం 7,8,9 తరగతులు చదువుతున్న విద్యార్ధులకు త్రి భాషా సూత్రాన్ని అమలు చేయడంలో ఒకసారి ప్రత్యేక సడలింపును సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఇప్పటికే ఫ్రెంచ్‌, జర్మన్‌, జననీస్‌ లేదా స్పానిష్‌ ‌వంటి రెండు విదేశీ భాషలు చదివే విద్యార్ధులు వాటిని కొనసాగించవచ్చు, వారు ఒక భారతీయ భాషను చేర్చుకుంటే సరిపోతుంది. వీరు 10వ తరగతికి వచ్చేసరికి థర్డ్‌ ‌లాంగ్వేజ్‌‌లో సీబీఎస్‌ఈ బోర్డ్‌ ‌పరీక్షకు ఈ బ్యాచ్‌‌ విద్యార్ధులు హాజరు కానక్కర్లేదు. వారు చదువుతున్న పాఠశాలల్లోనే అంతర్గత మూల్యాంకనం జరుగుతుందని, ఆయా భాషల్లో వారి సామర్ధ్యాన్ని సమీక్షిస్తాయని సీబీఎస్‌ఈ సవరించిన మార్గదర్శకాలు పేర్కొన్నాయి. అలాగే 2026-27 సంవత్సరానికి ప్రస్తుత 10వ తరగతి బ్యాచ్‌కు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతమున్న ద్విభాషా వ్యవస్థ కిందనే వారు కొనసాగుతారు. 2026-27 సంవత్సరానికి 6వ తరగతి బ్యాచ్‌ ‌నుంచి త్రి భాషా సూత్రం పూర్తి స్థాయిలో అమలవుతుంది. పదవ తరగతిలో థర్డ్‌ ‌లాంగ్వేజ్‌‌లో బోర్డు నిర్వహించే పరీక్షకు ఈ విద్యార్ధులు హాజరు కావాల్సి వుంటుంది. 2020లో తీసుకువచ్చిన నూతన జాతీయ విధానాన్ని (ఎన్‌ఈపీ) అమలు చేసే క్రమంలో విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సజావుగా, సాఫీగా జరిగేలా చూసేందుకు ఈ సడలింపును అందించినట్లు సీబీఎస్‌ఈ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -