Tuesday, June 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరు

ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరు

- Advertisement -


వామపక్ష‍ాల ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
జులై ఆరో తేదీన ఇందిరా పార్కు వద్ద మహాధర్నా : 
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, భూదాన భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు ఇండ్ల స్థలాలకు పట్టాలి వ్వాలనీ, ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్‌ ‌చేస్తూ వామపక్ష‍ పార్టీల ఆధ్వర్యంలో జులై ఒకటో తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు చేయనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావ ప్రకటించారు. జూలై 6న ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్‌ ‌ఉద్యమం తరహాలో పేదలకు ఇండ్లస్థలాలు, ఇండ్ల కోసం పోరాటం చేయబోతున్నట్టు తెలిపారు. వామపక్ష‍ పార్టీల ఆధ్వర్యంలో జరిగే ఈ ధర్నాలకు సీపీఐ శ్రేణులు, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నవారు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సిగాచి బాధిత కుటుంబాలకు 
యాజమాన్యం వెంటనే పరిహారమివ్వాలి
సిగాచి పరిశ్రమ ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు సంబంధించి బాధిత కుటుంబాలకు యాజమాన్యం వెంటనే పరిహారం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ ‌చేశారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ హృదయ విదారకమైన ఘటనలో చనిపోయిన కుటుంబాలకు ఒక కోటి రూపాయల పరిహారం యాజమాన్యం నుండి చెల్లించేలా చేస్తామని ఆనాడు సీఎం రేవంత్‌‌రెడ్డి ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ఆ కుటుంబాలకు చట్టపరంగా వచ్చే పీఎఫ్, ఈఎస్ఐ బీమాల మొత్తాలను కలుపుకొని కూడా ప్రకటించిన కోటి రూపాయలలో సగం కూడా అందకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. యాజమాన్యం తరఫున నుంచి ఒక కోటి రూపాయలు డిమాండ్ ఉన్నప్పటికీ ఖాతరు చేయకపోవడం, స్వయంగా హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం సిగాచి యాజమాన్య నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతున్నదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -