ఇంజినీరింగ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్
అగ్రి/ఫార్మాలోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వారికే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏపీ ఎప్ సెట్ -2026 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యా సంస్థల విద్యార్థుల హవా చాటారు. ఇంజినీరింగ్ లోనూ, అగ్రి/ఫార్మాలోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఆ సంస్థల విద్యార్థులు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఇంజినీరింగ్‌లోనూ, అగ్రి/ఫార్మాలోనూ రెండో ర్యాంకును కూడా కైవసం చేసుకున్నారు. టాప్ 10 లోపు 1,1,2,2,3,6,7,8,9,10,10 ర్యాంకులు, 100 లోపు 97 ర్యాంకులు పైగా, 500 లోపు 242 ర్యాంకులు పైగా ర్యాంకులు సాధించారు. అగ్రి/ఫార్మాలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంబంగి జస్వంత్ నాయుడు (హాల్ టికెట్ నెంబర్: 561375080788), రెండో ర్యాంక్ కుడుముల వెంకట మహంత్ అక్షజ్ రెడ్డి (561298010212), మూడో ర్యాంక్ కొండ్రెడ్డి హారిక దేవి శ్రీ అనూహ్య (561175081310), 8వ ర్యాంక్ దండమూడి జాగృతి (561175080307), 10వ ర్యాంక్ రేలంగి జయ షన్ముఖి (561175080355), ఇంజినీరింగ్‌లో స్టేట్ 1st ర్యాంక్ జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి (961075080454), రెండో ర్యాంక్ కోరుకొండ శ్రావ్య ( 960575050074), 6వ ర్యాంక్ ముక్కర సాకేత్ (960875080428), 7వ ర్యాంక్ బండి వెంకట సాత్విక్ ( 960675081066), 9వ ర్యాంక్ పసల మోహిత్ (960675080064), 10వ ర్యాంక్ మరక వంశీధర్ రెడ్డి (హాల్ టికెట్ నెంబర్: 961077020104) లాంటి అత్యుత్తమ ర్యాంకులు సాధించింది శ్రీచైతన్య విద్యార్థులే కావడం విశేషం.
గత 40 ఏండ్లుగా ఇంజనీరింగ్ లోనైనా, మెడికల్ లోనైనా అత్యధిక టాప్ ర్యాంకులు/స్కోర్లు సాధించిన ఘనత ఒక్క శ్రీచైతన్యదే. ఈ అత్యుత్తమ ఫలితాల వెనుక శ్రీచైతన్య సృష్టించిన అనేక సాధనలైన ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, ఇండిపెండెంట్ టెస్ట్ పేపర్లు, స్టూడెంట్ టీచర్ వన్ టూ వన్ అడాప్టన్ సిస్టమ్ తో నిపుణులైన అధ్యాపక బృందం శిక్షణ కీలకంగా నిలిచాయని శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ ఈ సందర్భంగా తెలిపారు. పోటీ పరీక్ష ఏదైనా, పరీక్షా విధానాలు ఎలా మారినా నెంబర్ వన్ గా నిలిచేది తమ విద్యార్థులేనని, ఈ ఏడాది విడుదలైన జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్‌లో సైతం టాప్ ర్యాంకులు సాధించిన ఘనత ఒక్క శ్రీ చైతన్యదేనని, రాబోయే నీట్-2026లో కూడా అగ్రస్థానం తమ విద్యార్థులదేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తమ విద్యార్థుల విజయపరంపర ఎప్పటికీ ఇలానే కొనసాగిస్తామని తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, తమపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని ఈ సందర్భంగా సుష్మ అభినందనలు తెలియజేశారు.



