Saturday, July 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం20 వేల కానిస్టేబుల్‌ఉద్యోగాలు భర్తీ చేయాలి

20 వేల కానిస్టేబుల్‌ఉద్యోగాలు భర్తీ చేయాలి

- Advertisement -

సీఎం రేవంత్‌‌రెడ్డికి కేటీఆర్‌ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‌రాష్ట్రంలో 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే యువత ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి గ్రామీణ వర్గాలేనని తెలిపారు. ఎన్నో కష్టాలు పడుతూ హైదరాబాద్‌లో రేయింబవళ్లు కష్టపడి ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు. వారి ఆశలపైన ప్రభుత్వం నీళ్లు చల్లొద్దని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నదే తెలంగాణ ఉద్యమ నినాదమని గుర్తు చేశారు. నియామకాల విషయంలో కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. 17 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వమే చెప్పినా ఇప్పటిదాకా భర్తీ మాత్రం చేయడం లేదని తెలిపారు. వేలాది పోలీస్ ఉద్యోగాలు వేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి హామీ ఇవ్వకున్నా 47 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. అన్ని శాఖల్లో 2.32 లక్ష‍ల ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫై చేసి 1.60 లక్ష‍లకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఎన్నికల ముందు యువతకు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని తెలిపారు. ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి యువతను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. కేవలం 17 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇప్పటిదాకా కాంగ్రెస్ ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రంలోని యువత తీవ్ర ఆగ్రహంతో ఉందని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -