Saturday, July 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం​అరుణోదయ నాగన్న మృతి ప్రజాతంత్ర ఉద్యమాలకు లోటు

​అరుణోదయ నాగన్న మృతి ప్రజాతంత్ర ఉద్యమాలకు లోటు

- Advertisement -

నివాళ్లర్పించిన సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ-ఖమ్మం

నిస్వార్ధ ప్రజా కళాకారుడు, గాయకుడు, ప్రజల గొంతుక అరుణోదయ నాగన్న మరణం ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటు అని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం అనారోగ్య కారణాలతో మృతిచెందిన నాగన్న మృతదేహాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, బండి రమేష్, బండి పద్మ, ఎస్‌కే మీరా సాహెబ్, బోడపట్ల సుదర్శన్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నామా లక్క్ష్మీ నారాయణ, కార్యదర్శి వేముల సదానంద్.. సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ.. నాగన్నతో మూడు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. సాధారణ పేద గీత కార్మిక కుటుంబంలో పుట్టిన నాగన్న ప్రజా సాంస్కృతిక రంగంలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంస్థకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా పని చేశారని, వేలాది కళాప్రదర్శనలు, పాటలు గానం చేశారని గుర్తు చేశారు. తన జీవితాన్ని ప్రజా సంస్కృతికోద్యమానికి అంకితం చేసిన గొప్ప సాంస్కృతిక యోధుడు అని కొనియాడారు. ఆయనతోపాటు ఆయన భార్య లక్క్ష్మీ, కుమారుడు విజయ్‌ని కూడా కళాకారులుగా తీర్చిదిద్దిన ఆదర్శ కళాకారుడు అని కొనియాడారు. ఆయన మృతికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ తరపున ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. ఆయన భార్యకు, కుమారునికి సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -