Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సన్నబియ్యంలో లోపించిన నాణ్యత

సన్నబియ్యంలో లోపించిన నాణ్యత

- Advertisement -

పురుగులు, మట్టిపెల్లలు, మెరిగలు, రాళ్ళు
నవతెలంగాణ-మద్నూర్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా లబ్దిదారులకు ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం మండల కేంద్రంలో రేషన్ షాపుల్లో వినియోగదారులు తీసుకున్న సన్నబియ్యంలో మట్టి పేల్లలు, మేరుగలు, పురుగులు, ఉన్నాయని స్తానికులు వాపోతున్నారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుకుంటూనే నాసిరకం, నాణ్యత లేని పురుగులున్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం అందేవిధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -