Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు ఎమ్మెల్యే ప్రత్యేక కృషి

సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు ఎమ్మెల్యే ప్రత్యేక కృషి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
ముఖ్యమంత్రి సహాయనిధి నిధుల మంజూరుకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని డోంగ్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బాచావార్ లక్ష్మణ్ అన్నారు. మాదన్ ఇప్పర్గా గ్రామానికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆదేశానుసారం లబ్దిదారులకు చెక్కులు అందించామన్నారు. అనంతరం చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉమాకాంత్ పాటిల్, ఉపసర్పంచ్ సరుబాయి, వార్డు సభ్యులు మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -