Tuesday, July 7, 2026
E-PAPER
HomeNewsగడువులోగా ఓటర్ల సర్వే పూర్తి చేయాలి 

గడువులోగా ఓటర్ల సర్వే పూర్తి చేయాలి 

- Advertisement -

– బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డ
నవతెలంగాణ – జుక్కల్ 

మండల పరిధిలోని 30 గ్రామ పచాయతీలలో సమగ్ర కార్యచరణ ఓటర్ల సర్వే గడువులోగా నమోదు చేయాలని బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ ఆర్డిఓ జుక్కల్ మండలం తాసిల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా పరిశీలనకు వచ్చారు. సందర్భంగా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. గ్రామాలలో నిర్వహిస్తున్న సమగ్ర ఓటర్ల సర్వేను ఫామ్స్ లను పంపిణీ ఎంతవరకు నిర్వహించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ 98 శాతం పాముల పంపిణీ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.

ఫాముల పంపిణీ తో పాటు ఆన్లైన్ కార్యక్రమం కూడా నిర్వహించాలని, ఈ కార్యక్రమాన్ని పరితగతిన నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లోని సమస్యల విషయంలో తాసిల్దార్ కార్యాలయానికి తరలి వచ్చిన ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దగుడ్లకు చెందిన భూ సర్వేలు సక్రమంగా నిర్వహించడం లేదని రైతు ఆర్డీవోకు తెలియజేశారు. వెంటనే సర్వే చేయాలని సర్వే అధికారికి ఆర్డీవో ఆదేశించారు. గత 12 రోజుల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగించడం లేదని ఆన్లైన్ సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు ఆడియోకు విన్నవించడం జరిగింది. భూ చట్టం ప్రకారం కొత్తగా రిజిస్ట్రేషన్ పనులు పెరగడంతో వాటి అప్డేట్ గురించి రాష్ట్రంలోని అన్ని మండలాల్లో సర్వర్ ప్రాబ్లం వలన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా కావడంలేదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ తో పాటు తాహసిల్దార్ మారుతి , డిప్యూటీ తాసిల్దార్ హేమలత, ఇంచార్జ్ ఆర్ ఐ మోహన్, సర్వేయర్ చరణ్ , సిబ్బంది సుజాత, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -