Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర, శ్రీ భాష్యం , మదర్ థెరిస్సా హైస్కూల్ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండలోని శ్రీ వెంకటేశ్వర, మదర్ థెరిసా హైస్కూల్ కు చెందిన మహిళ ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ కే రామలక్ష్మి రెడ్డి శాలువలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. భాష్యం పాఠశాల కరస్పాండెంట్ రత్నాకర్ మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మహిళలు ఇంటి పనులను చక్కబెడుతూనే ఉపాధ్యాయులుగా విద్యారంగంలో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటున్నారని మహిళా ఉపాధ్యాయుల పాత్ర సమాజంలో ఎంతో ఉంటుందని వారు కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -