రవాణా సౌకర్య ఖర్చులు అందజేసిన సర్పంచ్ ర్యకాల సంతోష శ్రీనివాస్….
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు సంబందించిన మెటీరియల్, రవాణా సౌకర్య ఖర్చులు వారి సొంత నిధులతో సర్పంచ్ ర్యకాల సంతోష శ్రీనివాస్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్బంగా డాక్టర్ ర్యకాల శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులంతా ఒత్తిడికి గురికాకుండా, ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలన్నారు.
మొదటి ర్యాంక్ లక్ష్యంగా పెట్టుకొని పరీక్షలకు సన్నద్ధమవ్వాలన్నారు. ఫలితాల్లో ఉతీర్ణత సాధించి తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, గ్రామానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. గ్రామంలోని విద్యార్థులకు పరీక్ష సమయంలో ఇలా వారికి అవసరమయ్యే స్టేషనరీ వస్తువులు అందించడం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. గత 5 సంవత్సరాల నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు వారి సొంత ఖర్చుతో వారికి కావలసిన సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు బహుమతి అందిస్తానన్నారు.
ఈ సహకారమే కాకుండా గ్రామంలో ఉన్న విద్యార్థులకు చదువుకు సంబంధించి ఎటువంటి సహాయం చేయడానికైనా నేను సిద్ధం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, ఎస్కే గాలిబి యాకుబ్, బొమ్మరపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మీ బాలరాజు, బిట్కూరు మహేష్, వరిగంటి మానస నాగరాజు, ఎస్కేహైమద్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.



