నిరవధిక సమ్మెకు
సిద్ధమవుతామని హెచ్చరిక
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
ఐకేపీ వీఓఏ ఉద్యోగులకు నెలకు రూ. 18 వేల వేతన హామీ, ఇతర వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ వీఓఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం వారు నల్లగొండ జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగీ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.సలీం మాట్లాడుతూ.. వీఓఏలకు సంబంధంలేని బుధవారం రివ్యూ మీటింగ్స్, ఉల్లాస్ యాప్‌లో పనిని ఆపాలని కోరారు. ప్రమాద బీమా రూ.10 లక్షలు, టాప్స్ నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఇప్పటికే కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, పర్మినెంట్ ఇవ్వాలని కార్మికవర్గం పోరాడుతోందని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికులను యాజమాన్యాలు దోపిడీ చేసేందుకు అవకాశం ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లేబర్ కోడ్స్ అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కార్మికుల వేతనాల పెంపు కోసం ఇచ్చిన జీవోలు సవరించాలని కోరారు. సెర్ప్ సీఈఓ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిలుముల దుర్గయ్య, పి.సులోచన మాట్లాడుతూ.. వీఓఏల సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఈనెల 27న కలెక్టరేట్ ముట్టడి అనంతరం నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, నాయకులు పోలె సత్యనారాయణ, వెంకన్న, కె. రేణుక, బి. సురేష్, కె.చంద్రకళ, రాందాస్, వై.పాపయ్య, వల్లెపు రాజేశ్వరి, జటావత్ సరోజ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి క్యాంపు ఆఫీస్‌ను ముట్టడించిన వీఓఏలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



