Monday, July 20, 2026
E-PAPER
Homeక్రైమ్18 రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి..

18 రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి..

- Advertisement -

నవతెలంగాణ- జోగిపేట : సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో శనివారం ఓ కసాయి తండ్రి 18 రోజుల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని వాసవి నగర్ కాలనీలో కొంతకాలంగా గౌరీ, కృష్ణ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య వంట చేయలేదనీ, ఇద్దరి మధ్య శుక్రవారం అర్ధరాత్రి గొడవ జరిగింది. ఉదయం కూడా భార్య గౌరీ వంట చేయకపోవడంతో కోపంతో, భార్యపై అనుమానంతో 18 రోజుల మగ శిశువును నేలకేసి కొట్టాడు. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని హుటాహుటిన జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్సలు చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో శిశువు మృతి చెందాడు. కసాయి తండ్రి కృష్ణ నిత్యం మద్యం మత్తులో ఉండి భార్యతో తరచూ గొడవ పడేవారని స్థానికులు తెలిపారు. వీరిద్దరూ గత మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఘటన వివరాలను జోగిపేట పోలీసులకు తెలపడంతో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి విచారణ చేసి శిశువు తల్లితో గౌరీతో పిర్యాదు తీసుకున్నారు. కసాయి తండ్రి కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -