Monday, July 20, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్‌బిజీ జీవితం.. క్రీడలతో మానసికోల్లాసం

‌బిజీ జీవితం.. క్రీడలతో మానసికోల్లాసం

- Advertisement -

నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్‌11వ వార్షికోత్సవం సందర్భంగా క్రీడాపోటీలు ప్రారంభం
‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో నైపుణ్యం పెంపొందించుకోవాలనీ, క్రీడల ద్వారా మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యం మెరుగు పడుతుందని నవతెలంగాణ చీఫ్‌ ‌జనరల్‌ ‌మేనేజర్‌ ‌పి.ప్రభాకర్‌ అన్నారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌‌లోని పత్రిక సిబ్బందికి, కుటుంబ సభ్యులకు క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ… క్రీడోత్సవాల్లో నవతెలంగాణ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆటలపోటీల్లో గెలుపోటములు సాధారణమనీ, ప్రతిఒక్కరూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. నవతెలంగాణ క్రీడోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తొలుత మహిళలకు టెన్నికాయిట్‌, ఖోఖో, క్యారమ్స్‌, చెస్‌, స్కిప్పింగ్ క్రీడాపోటీలను నిర్వహించారు. హెచ్‌ఆర్‌ ‌జీఎం నరేందర్‌‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడాపోటీల్లో హెచ్ ఆర్ జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఫైనాన్స్‌ జనరల్‌ ‌మేనేజర్‌ ‌శశిధర్‌, ఎస్టేట్‌ ‌మేనేజర్‌ ‌వీరయ్య, ఎడిటోరియల్‌ ‌బోర్డు సభ్యులు ‌సలీమా, అజయ్‌, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -