Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్, అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచంద్రరావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాస్కెట్బాల్ లో మెరుగు రామ్ చరణ్, కొమ్మెర చరణ్, మారవేణ జ్యోతి, భూతం సాయి, వర్షిని 10వ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ నెల 20 నుండి 22 వరకు వక్సన్ యూనివర్సిటీ హైదరాబాద్ లో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా అథ్లెటిక్స్ పోటీలో కొడారి యశస్విని, తేజస్విని హన్మకొండలో జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సెలెక్ట్ అయిన క్రీడాకారులను, ఫిజికల్ డైరెక్టర్ పక్కల రాజబాబును, కోచ్ రఘువీరును పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ పూర్ణచందర్రావు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -