Thursday, July 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కుభీర్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్

కుభీర్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
ఎల్ నీ నో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం అతి తక్కువగా నమోదు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లోటు వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జలసిరి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం మండలంలోని డోడర్న గ్రామంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా పర్యటించి, పంట కుంట (ఫార్మ్ ఫండ్) పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వర్షపు చుక్కను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని రైతులకు సూచించారు. వర్షపు నీటిని వృధా చేయకుండా భూగర్భ జలమట్టాలను పెంచడానికి పంట కుంటలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

రైతులు తమ పొలాల్లో వీటిని నిర్మించుకోవడం ద్వారా సాగునీటి ఇబ్బందులను అధిగమించవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు జల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం పంట కుంటల నిర్మాణ పనుల స్థితిగతులను పిడి విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వ్యవసాయ అధికారులు యూరియా యాప్ పై అవగాహన కల్పిస్తున్నారా లేదా అని రైతులను తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ జలసిరి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణ అధికారి విజయలక్ష్మి, తహసిల్దార్ శ్రీదేవి,ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో హరిలాల్, వ్యవసాయ అధికారిని సారిక, ఆయా శాఖలకు చెందిన అధికారులు, గ్రామ సర్పంచ్ సావిత్రిబాయి, నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -