Thursday, July 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కుభీర్ మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి

కుభీర్ మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి

- Advertisement -

శవపాడెతో నిరసన వ్యక్తం చేసిన కొత్తూరు శంకర్
నవతెలంగాణ-కుభీర్
మారుమూల మండలమైన కుబీర్ మండలానికి ఇప్పటివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో మండల ప్రజలు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్తూరు శంకర్ గురువారం మండల కేంద్రమైన వివేకానంద చౌరస్తాలో శవ పాడేతో నిరసన చేపట్టాడు. అత్యవసర పరిస్థితుల్లో భైంసా ఆస్పత్రికి కుబీర్ మండల ప్రజలు వెళ్లాలంటే దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సొస్తుందన్నారు. అక్కడికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని శవ పాడే ముందు బైఠాయించి బోరున విలపిస్తూ నిరసన తెలిపాడు.

ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలోనే అతి పెద్ద మండలమైన కుభీర్ లో అంబులెన్స్ లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యనికి నిదర్శనం అని అన్నారు. ప్రజలకు ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్ కు ఫోన్ చేస్తే గంటకు పైనే సమయం పడుతోందన్నారు. ఒకవేళ అంబులెన్స్ అందుబాటులో లేకపోతే ఇతర వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇతర వాహనాలు కూడా అందుబాటులో లేకపోవడంతో చిన్న చిన్న ప్రమాదాలకే సరైన సమయంలో చికిత్సలు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. వెంటనే జిల్లా అధికారులు, పాలకులు స్పందించి, కుభీర్ మండలానికి అంబులెన్స్ ను కేటాయించి, ప్రజల ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -