- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాల్లో LPG స్టాక్ ఉందని వెల్లడించింది. గృహ వినియోగదారులందరికీ LPG 100 శాతం సరఫరా చేశామని తెలిపింది. హార్మూజ్ వద్ద భారత నౌకలన్నీ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించింది. శివాలిక్ నౌక ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు భారత్ చేరుకుంటుందని పేర్కొంది. శివాలిక్ నౌకలో 48 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉందని స్పష్టం చేసింది.
- Advertisement -



