బెంగళూరు : ట్రంప్ సామ్రాజ్యవాద చర్యలతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా స్టాక్ మార్కెట్లు పతనమవుతోన్న నేపథ్యంలో వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)ను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. ఐపిఒకు ఇప్పటికే సెబీ నుంచి అనుమతి పొంది.. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.10,000 కోట్లకు పైగా సమీకరించాలని భావించినప్పటికీ ప్రస్తుత అనిశ్చితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సిఇఒ సమీర్ నిగమ్ వెల్లడించారు. 65 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లతో డిజిటల్ చెల్లింపుల రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఈ సంస్థతో పాటు, సుమారు రూ.1.64 లక్షల కోట్లు సమీకరించేందుకు సిద్ధంగా ఉన్న మరో 140 కంపెనీలు కూడా మార్కెట్ స్థిరత్వం కోసం వేచి చూస్తూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.



