Monday, July 27, 2026
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ వార్తకు స్పందన 

నవతెలంగాణ వార్తకు స్పందన 

- Advertisement -

చిత్తు కాగితాలపై బిల్లులు రాసిస్తే కఠిన చర్యలు : ఏఓ రాజు
నవతెలంగాణ-మద్నూర్

ఈమధ్య నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ఓ శీర్షికకు స్పందన లభించింది. “నిబంధనలు పాటించని ఫర్టిలైజర్ దుకాణ యజమానులపై చర్యలు” అనే వార్తకు మండల వ్యవసాయ అధికారి రాజు స్పందించారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన మద్నూర్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను మళ్ళీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫార్టిలైజర్ షాప్ యజమానులను హెచ్చరిస్తూ..చిత్తు కాగితాలపై బిల్లులు ఇస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు విధిగా ఒరిజినల్ బిల్లులు అందజేయాలని ఆదేశించినట్టు ఆయన నవతెలంగాణకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -