చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఓ పాట చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళారు. అక్కడ చిరంజీవి, తమన్నాలపై ఓ సాంగ్‌ని గ్రాండ్‌గా చిత్రీకరించారు.
ఈ పాటకు సంబంధించిన విశేషాలను చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
‘స్విట్జర్లాండ్‌లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్‌లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆటపాట ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం! అప్పటివరకూ ఈ ‘చిరు లీక్స్’ పిక్స్ అంటూ లొకేషన్ స్టిల్స్‌ని షేర్ చేశారు. మహతి స్వర సాగర్ ఈ పాట కోసం రాకింగ్ నెంబర్ని స్కోర్ చేశారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లో ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సమపాళ్లలో ఉండనున్నాయి. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సిస్టర్‌గా కీర్తి సురేష్ కనిపించనుంది. సుశాంత్ ఈ సినిమాలో లవర్ బారు పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, ఉత్తేజ్, వీర్, షహ్వర్ అలీ, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, డీవోపీ: డడ్లీ, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, కథా పర్యవేక్షణ: సత్యానంద్, డైలాగ్స్: తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్.