- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26) మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలను ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 28, 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 9:30am నుంచి 8:30pm వరకు పని చేస్తాయని చెప్పింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, స్లాట్ల సంఖ్యను పెంచి, సెలవు దినాల్లో కూడా పనిచేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -



