Saturday, August 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎవరిది తప్పు? క్షమాపణ చెప్పాల్సింది ఎవరు?

ఎవరిది తప్పు? క్షమాపణ చెప్పాల్సింది ఎవరు?

- Advertisement -

గత కొద్ది వారాలలో చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ తలకిందులుగా కనిపించడమనే విలోమ జాడ్యం బారిన పడుతున్నారని స్పష్టమైపోతుంది. జెన్‌ ‌జి ఉద్యమం, విపరీతమైన తన ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల దిశ ప్రజానీకాన్ని ఆవరించిన ఘోరమైన వాస్తవాలతో ఇవి ముఖాముఖి ఘర్షణ పడుతున్న తీరు ఆయనకు కనిపిస్తుంది. వీటి దెబ్బతో ఆయన నిద్రకు దూరమై రీళ్లు, వీడియో సందేశాలు చేస్తున్నారు. తన పాలనా శైలిలో తీవ్రమైన లొసుగులను సమర్థించుకోవడానికి గాక గత కొన్ని వారాలను ప్రధానంగా ప్రభావితం చేసిన ఘర్షణ స్వభావంతో వున్న ఎడం తగ్గించు కునేందుకు ప్రయాస పడుతున్నారు. ఈ సమాచార లోపాన్ని భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఆయన వాస్తవాన్ని తలకిందులుగా చేసే విలోమ దృష్టిలోనే మునిగితేలుతున్నారు. జెన్‌ ‌జి అనే కలగాపులగపు వ్యక్తీకరణతో సంబోధించబడుతున్న యువతీ యువకుల నుంచి తీవ్ర స్థాయిలో ఎదురైన విస్తార నిరసనను ఎదుర్కొనడానికి విషపూరితమైన అమానుష పద్ధతులకు పాల్పడ్డారు. ఈ యువ నిరసనకారులకు క్షమాపణలు చెప్పడంలోనూ ఆయన ఇదే విధమైన పితృస్వామిక స్వరమే వినిపించారు. మరీ ముఖ్యంగా యువ మహిళా నిరసనకారులు ఉపయోగించిన భాష ఆయనకు మరీ కష్టం కలిగించింది.

ఆసక్తికరంగా కొంతమంది యువజనులు ఓ విధమైన వ్యంగ్యాస్ర్తంతో ప్రతిస్పందించారు. ‘బాబాయ్‌ ‌బాగా పొద్దు పోయింది. వెళ్లి పడుకోండి’ అన్నారు. ఇదేదో వారికీ ఆయనకూ మధ్యనగల అనేక తరాల వయో భేదానికి సంబంధించిన దూరం కాదు. ఈ నిరసన అంతకన్నా మౌలికమైన దృక్పథానికి సంబంధించింది. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అనేది వుండాలన్న మౌలిక ప్రశ్నను యువజనులు లేవనెత్తారు. ఈ ప్రాథమిక ప్రశ్ననే ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఈ నిరసనలు కోరుతున్నది కేవలం ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా మాత్రమే కాదు. అసలు ఒక కుట్రపూరిత ధోరణిలో జవాబుదారీతనం అన్న ఊసే లేకుండా పోయిన పరిస్థితికి వారు నిష్కృతి జరగాలం టున్నారు. తమ స్వప్నాలను కూల్చివేసిన ప్రభుత్వపు పూర్తి అసమర్థ నిర్వాకం, వైఫల్యాలకు ప్రాయశ్చిత్తం వుండాలం టున్నారు. ఆ లోపాలు చక్కదిద్దడం ఆ తర్వాత విషయం.

తరాల తేడా కాదు
కానీ మోడీ గుర్రం ముందు బండి పెడుతున్నారు. మరింత మౌలికమైన అంశాలను పరిష్కరించే బదులుగా ఆయన ఘర్షణను వాయిదా వేయాలని చూస్తున్నారు. ఇంకా తను చక్రం తిప్పే పరిస్థితిలోనే వున్నట్టు తనపై వ్యాఖ్యలు చేసిన నిరసనకారుల క్షమాపణలు ఆమోదించేసే పాత్ర తనదైనట్టు భ్రమిస్తున్నారు. ఇక్కడ అసలు సమస్య అదేనన్న భావన కల్పించవచ్చునని ఆయన ఉద్దేశపూర్వకంగానే అభినయిస్తు న్నారు. క్షమాపణ చెప్పవలిసింది ఈ మోడీనే. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసు, ఇతర విభాగాలు అమానుషానికి పాల్పడిన తీరు ఇప్పుడు రీల్‌ ‌సాక్ష్యాలతో సహా స్పష్టంగా తెలిసిపోయింది. పూర్తి వివరాలు ఇప్పుడు అందుబాటులో వున్నాయి. మొట్టమొదటి సారిగా కాశ్మీర్‌ లోయ ‌వెలుపల నిరసనలపై పెల్లెట్‌ ‌తుపాకులు ప్రయోగించబడ్డాయి. ముళ్ల కర్రల వాడకం అన్నిటికన్నా ఘాతుకమైంది. వారు రాళ్లు వేసుకుని వచ్చిన ఒక ట్రక్కు దొరికిపోయింది. వాటిని తామే విసిరి హింసను రెచ్చగొట్టడం యువ నిరసనకారులపై నింద మోపడం ఇక్కడ పథకం. ఇది కేవలం సైబర్‌ రూపంలోనే గాక ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు విచారణల సందర్బంలోనూ వెల్లడైంది. కేంద్రం ఉన్నతాధికారులు బట్టలూడదీసుకుని మరీ దొరికిపోయారు. బాగా పైస్థాయి ఢిల్లీ పోలీసు అధికారులు సంజాయిషీ చెప్పడానికేమీ లేక నోరు వెళ్లబెడుతున్నారు.

క్షమాపణ ప్రహసనం
మరి క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? యువ విద్యార్థులా లేక అమిత్‌ ‌షా, నరేంద్ర మోడీలా? మంత్రివర్గం, ప్రభుత్వం సమిష్టి బాధ్యత వహించాలనే సువ్యవస్థిత సూత్రం అదే కదా? ఇక్కడ జవాబు చెప్పకుండా ఎవరూ తప్పించుకోలేరు. గత రెండు వారాలుగా ప్రధాన మంత్రి, హోం మంత్రి పార్లమెంటుకు రాకుండా మొహం చాటేస్తున్న తీరే ఇందుకు కావలసినంత సాక్ష్యం.తాను క్షమాపణ ఆమోదించడానికి సిద్ధంగా వున్నానని ప్రధాని కపట నాటకం నడిపిన తర్వాత కూడా బీజేపీ ఐ.టి విభాగం, హిందూత్వ దళం జాగిలాలు యువ నిరసనకారులను వేటాడుతూ వేధిస్తూనే వున్నాయి. బెదిరింపులతో హడల గొట్టేందుకు పాల్పడుతున్నాయి. నోయిడాలో పదిహేనేళ్ల బాలికపై, ఆమె తల్లిపై ఒత్తిడి చేసి క్షమాపణ చెప్పించడం ఇందుకో తాజా ఉదాహరణ. అయినా సరే వారి వేధింపులు బెదిరింపులు ఆగలేదు. ఆ బాలిక తల్లితో సహా ఆ ఇల్లు వదలి వెళ్లవలసి వచ్చింది.

విరామం లేని విష ప్రచారం
మహిళల విషయంలో ప్రభుత్వ బూటకత్వం మరో విధంగా కూడా స్పష్టమై పోయింది. తానేదో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని చూస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడు తున్నాయననే ఆరోపణ అబద్ధమని రుజువైంది. మహిళా రిజర్వేషన్‌ను నియోజకవర్గాల పునర్విభజన నుంచి విడదీసి అమలు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు చాలా విస్తృతమైన ప్రాతిపదికన కలసి నిరాహారదీక్ష చేస్తున్నాయి. అయితే హతవిధీ! పార్లమెంటులో నాటకం మహిళలకు రిజర్వేషన్‌ ‌కల్పిం చడం కోసం కాదు కదా! దొంగచాటున పార్లమెంటు సీట్లను పెంచేసుకునే బిల్లు ప్రవేశపెడితే మనమున్న ప్రజాస్వామ్య చట్రంలో బీజేపీ-ఆరెస్సెస్ల ఉడుం పట్టు శాశ్వతమై పోతుందన్న భ్రమ సృష్టించడానికే. ఈ ప్రక్రియలో ఏమంత దాపరికం లేకుండా జరిగే తతంగం ‘ఆపరేషన్‌ ‌కమలం’ తప్పుడు పద్ధతుల్లో కొనసాగిం చడం. ఆచరణలో చెప్పాలంటే ఇది ఎన్నికైన ప్రజాప్రతినిధుల బేరసారాలే. ఇది కూడా ప్రజాభ్రిపాయ బలాన్ని వాటి వ్యక్తీకరణనూ తప్పుగా అంచనా వేసిన భ్రమాపూరిత వ్యూహాల ఫలితమే. ప్రజల ఆలోచనలు ఎలా వున్నాయో తెలియడానికి తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఒక అతి ప్రాథమిక సూచికగా ఉపయోగపడగలవు.

వరుస దాడులపై సమరం
పార్లమెంటులో దాని చుట్టుపక్కల జరిగేదేమిటన్నది అలా వుంచితే ఎన్నికల వ్యవస్థ సమగ్రత సమస్య అనేది ఒకటుంది. ప్రజల జీవనోపాధికి సంబంధించిన మౌలిక అంశాలు మరింత దారుణంగా తయారవుతున్నాయి. ఎం‌.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎ వంద రోజుల పనికల్పన స్థానంలో వి.బి గ్రామ్‌ జి తెచ్చిపెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో పని లేకపోవడానికి దారి తీయడం కూడా అసంతృప్తి పెంచుతున్నాయి. ఆ అసంతృప్తికి రూపమిచ్చేలా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ఐక్యత విస్తరిస్తోంది. కార్పొరేట్ దళారులను మేపడం కోసం బాహాటంగా తీసుకున్న చర్యల వల్ల కార్మికుల కూ తమ వంతు కడగండ్లు దాపురించాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో పూర్తిగా ఉపసంహరణ నిరుద్యోగం, అరకొర ఉపాధి సమస్యలను ఇంకా తీవ్రం చేస్తోంది. లేబర్ కోడ్లు వారి హక్కుల విస్తరణకు గాక అణచివేతకు కారణమ వుతున్నాయి. పర్యవసానంగా పునాది వర్గాలు పోరాట పథం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ ఎత్తున జరిగిన జాతీయ సదస్సు ఇచ్చిన విస్తృతమైన పిలుపు మేరకు ఈ సంఘాలు ఆగస్టు 10న పోరాటం చేయనున్నాయి. వాస్తవం ఏమంటే పార్లమెంటరీ జవాబుదారీతనం, ఎన్నికల వ్యవస్థ సమగ్రత అనే వాటి చట్టబద్దతను తోసిపుచ్చడం ద్వారా మోడీ, ఆయన శిష్యగణం ఈ విధమైన వీధి పోరాటాలకు న్యాయబద్దత కల్పించారు. ఇప్పటికే ఊపు మీదున్న ఆ పోరాటాలు మోడీ క్షమాపణ చెప్పక తప్పని స్థితి తీసుకొస్తాయి.
(ఆగస్టు 5 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -