- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద టాటా ఏసీ ఆటో, బైక్ ఢీకొనడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
- Advertisement -



