నవతెలంగాణ – సారంగాపూర్
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని స్వర్ణ కోదండ రామాలయం, జామ్ పట్టాభి రామాలయంలలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్బంగా ఆడెల్లి శ్రీ పోచమ్మ ఆలయం తరపున చైర్మెన్ సింగం భోజగౌడ్ , ఈఓ భూమయ్య లుపట్టు వస్త్రములు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి సీతారాములను దర్శించి కళ్యాణాన్ని తిలకించారు.
ఈ సందర్బంగా ఆలయ పూజారి చే ఆశీర్వాదాలు పొందారు. కమనీయమైన కళ్యాణఉత్సవాకి మండలంలోని ఆయా గ్రామాల భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. వీరి వెంటా మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ అట్ల మైపాల్ రెడ్డి, నాయకులు పాకాల రామచందర్, డి రాజేశ్వర్ సర్పంచ్ మల్లేష్, మాధవరావు, బోజరెడ్డి, చందు, ఉట్ల రాజేశ్వర్ రాజు రావు, వినయ్, నారాయణరెడ్డి, గంగాధర్ భోజన్న, ప్రవీణ్ గౌడ్, తదితరులు ఉన్నారు.



