- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని బిజ్జల్ వాడీ గ్రామంలో హెచ్ ఎం రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు బోనమెత్తారు. ఈ క్రమంలో పోతరాజు, అమ్మవారి వేషధారనలో చిన్నారులు బోనమెత్తి గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. వర్షాలు బాగా కురవాలనీ, రైతుల ఇంట సిరులు నిండాలనీ, తమకు విద్యా జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థిని, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



