Sunday, August 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హైస్కూల్ గ్రౌండ్ లో నిలిచిన వర్షం నీరు 

హైస్కూల్ గ్రౌండ్ లో నిలిచిన వర్షం నీరు 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
ఆలేరు పట్టణంలో శనివారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో కురిసిన వర్షంతో పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర క్రీడా మైదానంలో వర్షం నీరు చేరింది. విద్యార్థులకు డ్రిల్ సమయంలో ఆటలాడుకునేందుకు, రోజు ఉదయాన్నే వాకింగ్ చేసే వాకర్స్ కు తీవ్ర ఇబ్బంది కలిగింది. రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ జలమయంగా మారింది. వర్షం నీరు నిలిచిపోవడంతో అండర్ పాస్ గుండా కోలను పాక రోడ్డు నుండి రైల్వే గేట్  వైపు వచ్చే వాహనాలకు, పట్టణంలోని మెయిన్ రోడ్డు నుండి కులంపాక రోడ్డు వైపు వెళ్లే వాహనాల ప్రయాణం ఇబ్బందిగా మారింది. 

మెయిన్ రోడ్డు కిరువైపులా చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది. రోడ్డుకి ఇరువైపులా వర్షం నీరు నిలిచిపోతుంది. బస్టాండ్ వద్ద, రైల్వే స్టేషన్  వద్ద పెద్ద సంఖ్యలో గుంతలు ఏర్పడ్డాయి. భారీ వాహనాలు రోడ్డు పక్కన ఆగితే చాలు దిగబడే పరిస్థితి నెలకొంది. రైల్వే గేట్ అండర్పాస్ లో చేరిన నీటిని, హై స్కూల్ గ్రౌండ్ లో మీ ఫ్రీడ మైదానంలోని చైర్మన్ నీటిని తొలగించాలని స్థానికులు, విద్యార్థులు, వాహనదారులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -