- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు దోగ్గేల సుధాకర్ (39) మృతి చెందిన సంఘటన మండలంలోని నాచారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం సుధాకర్ నాచారం గ్రామపంచాయతీలో సపాయి కార్మికుడుగా గత పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో మృతిచెందినట్లుగా తెలిపారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో కార్మికుని కుటుంబం రోడ్డున పడింది.ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మృతునికి ఇద్దరు పిల్లలున్నారు.
- Advertisement -



