నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని దుర్గాభవాని తండా గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్డింగును పీన్య తండ రామోజీ తండా మధ్య పరిధిలోనే గ్రామపంచాయతీ బిల్డింగ్ కట్టాలని ఆ తండావాసులు గుగులోతు నవీన్ ఇస్లావత్ సురేష్ భూక్య జగన్ విస్లావత్ హనుమంతు గుగులోతు మంగీలాల్ ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను కోరినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో దుర్గాభవాని తండా వద్దు పీన్యా తండా ముద్దు అనే నినాదంతో నీరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాతో కొన్ని ఏళ క్రితం దుర్గ భవని తండా మరియు రామోజీ తండా పిన్య తండ ల ను కలిపి మొదటగా పీన్య తండా గ్రామపంచాయతీ అని గుర్తించారని అన్నారు ఆ తర్వాత దుర్గ భవాని తండాగా మారింది అని తెలిపారు.
కానీ దుర్గాభవాని తండా ఏర్పడినప్పుడు గ్రామపంచాయతీ బిల్డింగ్ ను పీణ్యా తండాలోనే నిర్మించాలని తండావాసులు అందరం ఏ కస్తులమై సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోదాన్ని తెలిపినట్టు చెప్పారు. కానీ ఇప్పటి సర్పంచ్ వీరన్న అనే వ్యక్తి తన తండా పరిధిలోనే ఉండాలని మాకు చెప్పకుండా జిపి బిల్డింగ్ పనులను నిర్వహించడంతో మా తండావాసులు మాకు సమాచారం లేకుండా ఎలా ఆ జిపి బిల్డింగ్ పడతారన తండావాసులు ప్రశ్నించినట్లు తెలిపారు. సర్పంచును అడుగ వినకపోవడంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
ఈ స్థలానికి పోలీసు ఎస్సై చిర్ర రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి తండాకు చేరుకొని చేరుకొని సమస్యను అడిగి తెలుసుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని విరమించండి రాకపోకలకు ఇబ్బంది కలిగించవద్దు అందరూ కూర్చొని శాంతియుతంగా బిల్డింగ్ పనులు చేపట్టుకోవాలని వారికి నచ్చజెప్పి నిరసన కార్యక్రమాన్ని వివరింపజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు తండా గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.



