Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలుపు మొక్కల నివారణ చర్యలు 

కలుపు మొక్కల నివారణ చర్యలు 

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
వర్షాకాలంలో గ్రామంలో దోమలు,క్రిమికీటకాలు పెరగకుండా నివారించేందుకు గురుకుంట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ రవిందర్ రెడ్డి,ఉప సర్పంచ్ రాజశేఖర్ కలిసి కలుపు మొక్కల నివారణ చర్యలు చేపట్టారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన రహదారులు,అంబేద్కర్ విగ్రహం పరిసరాలు, ఖాళీ స్థలాలు నివాస ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలపై మందు పిచికారీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామపంచాయతీ పాలకవర్గం కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -