Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హమాలీలకు వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలి

హమాలీలకు వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలి

- Advertisement -

సిఐటియు మండల కార్యదర్శి పెరుమళ్ళ బాబు గౌడ్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ప్రకారం హమాలీలకు వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క హమాలికి వర్తింపజేయాలని కోరుతూ గురువారం స్థానిక తహసిల్దార్ చందా నరేష్ కి వినతి పత్రాన్ని అందించినట్లు సిఐటియు మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నెల్లికుదురు మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న అమాలి కార్మికులు తీవ్రమైన ఆర్థిక సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నాడు.

సమాజంలో సకల ప్రజలకు  సరుకులు అందించడంలో అమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నారు అని తెలిపాడు. ఇంత చాకిరి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అమాలీల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చెందాడు. నిత్యవసర వస్తు ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ అమలీల కూలీ రేట్లు పెరగలేదు పని భద్రత సామాజిక భద్రత ఆరోగ్య రక్షణ సంక్షేమ సౌకర్యాలు లేక వేలాదిమంది హమాలి కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది అందుకోసం ప్రభుత్వాలే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అమలి కార్మికుల కోసం ప్రత్యేకంగా హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హమాలీ కార్మికులందరికీ హెల్త్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయినా నేటికీ అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని అన్నాడు.

తెలంగాణ రాష్ట్రంలోనే హమాలీ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి అసంఘటిత కార్మికులుగా నమోదు చేయాలి,55 సంవత్సరాలు పైబడిన హమాలీ కార్మికులకు నెలకు కనీసం రూపాయలు 6000 పెన్షన్ ఇవ్వాలి,హమాలి పనిచేస్తు ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూపాయలు 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి,అమాలీలందరికీ ప్రమాద బీమా సహజ మరణ పరిహారం ఆరోగ్య భీమా విద్యా సహాయం ప్రసూతి ప్రయోజనాలు కల్పించాలి,ఈ కార్యక్రమంలో హమాలి కార్మిక నాయకులు ఇసంపల్లి ఐలేష్, వెంకన్న, బిక్షపతి, నరేష్  యాకయ్య కే శీను హెచ్ శ్రీను మహేందర్ పూజారి సంపత్, మంచాల శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -