నవతెలంగాణ -వీపనగండ్ల
వనపర్తి జిల్లా నవతెలంగాణ డివిజన్ ఇన్చార్జ్ బక్కి బాబు తల్లి ఉషమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం విధితమే. సోమవారం వనపర్తి జిల్లా చిన్నింబాయి మండలంలోని దగడపల్లి గ్రామంలో దశదినకర్మ నిర్వహించారు. ముందుగా బక్కి ఉషమ్మ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. దశదిన కార్యక్రమానికి నవతెలం గాణ సీజీఎం ప్రభాకర్, మఫిషియల్ ఇన్చార్జ్ వేణుమాధవ్, ఏడీవీటీ జనరల్ మేనేజర్ వెంకటేష్ ,హెచ్ఆర్ జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, రంగారెడ్డి మేనేజర్ మహేందర్ రెడ్డి, మహబూబ్‌నగర్ రీజియన్ మేనేజర్ ఎం కార్తీక్, సబ్ ఎడిటర్ రాజేందర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, మహబూబ్‌నగర్ డివిజన్ ఇన్చార్జి ప్రవీణ్, వనపర్తి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్య నాయక్, వనపర్తి పట్టణ కమిటీ సభ్యులు బిసన్న, విలేకర్లు రాము, శేఖర్, పలువురు పాల్గొన్నారు.
బుక్హాస్ జీఎం వాసుకు సానుభూతి
నవతెలంగాణ బుక్ హొస్ జనరల్ మేనేజర్ వాసు మామ ఆంటోని (86) అనారోగ్య కారణాలతో ఆదివారం మరణించారు. సోమవారం బోయిగూడలో అంత్యక్రియలు నిర్వహించారు. నవతెలంగాణ జీఎం శశిధర్, సతీష్‌కుమార్, శ్యామ్‌రాజ్ నివాళులర్పించారు. ఆంటోని మృతిపట్ల నవ తెలంగాణ యాజ మాన్యం సంతాపం ప్రకటించింది. వాసుకు, ఆయన కుటుంబ సభ్యులకు సీజీఎం ప్రభాకర్, ఎడిటర్ రమేశ్, జీఎంలు, బోర్డు సభ్యులు, మేనేజర్లు సానుభూతి తెలిపారు.
బక్కి ఉషమ్మకు ఘన నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



