Tuesday, August 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైళ్ల భద్రతా ప్రమాణాలను పాటించాలి

రైళ్ల భద్రతా ప్రమాణాలను పాటించాలి

- Advertisement -


 దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ 
ఎస్‌‌కె శ్రీవాస్తవ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జోన్ పరిధిలో రైలు కార్యకలాపాల భద్రతపై సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్‌తో పాటు వివిధ శాఖల ప్రధాన అధిపతులు హాజరయ్యారు. సికింద్రాబాద్ , హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమావేశంలో, నాన్-ఇంటర్‌లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. నిర్దేశించిన అన్ని భద్రతా పని నియమాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సురక్షితమైన రైలు కార్యకలాపాలను నిర్వమించాలని సూచించారు. ముఖ్యంగా పాయింట్లు , క్రాసింగ్‌ల వద్ద భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడంపై ఫీల్డ్ స్టాఫ్ , కాంట్రాక్ట్ సిబ్బందికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనరల్ మేనేజర్ ట్రాక్‌ల సమీపంలో నిర్మాణ ప్రదేశాలలో ఎలాంటి నిర్మాణ సామగ్రిని వదిలివేయకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిబ్బందికి క్రమం తప్పకుండా రిఫ్రెషర్‌ కోర్సులు నిర్వహించాలనీ, తద్వారా తాజా భద్రతా ప్రమాణాలు, నియమ నిబంధనలు, నిర్వహణ విధానాలపై సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండేలా చూడాలని సూచించారు. జోన్‌ పరిధిలో రైళ్ల సురక్షిత నిర్వహణకు అన్ని స్థాయిల సిబ్బందిలో నిరంతర అప్రమత్తతను కొనసాగిస్తామన్నారు. భద్రతపై అవగాహనను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -