డీసీసీ మాజీ అధికార ప్రతినిధి దుశ్యంత్ రెడ్డి
నవతెలంగాణ-నవాబు పేట
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి సంక్షేమంపై దృష్టి ఉంటుందని డీసీసీ మాజీ అధికార ప్రతినిధి ధుశ్యంత్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని రేకుల చౌడపూర్ గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులతో అండర్ డ్రైనేజీ పనుల భూమి పూజ, దర్పల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవం, సిద్దోటం గ్రామంలో మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవం, తీగలపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవనం, అంగన్‌వాడీ భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయా గ్రామాల సర్పంచ్లు ఉపసర్పంచులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ఏకైక ప్రభుత్వం అని కొనియాడారు. ఇక మున్ముందు మరింత అభివృద్ధి పథంలో పల్లెలు ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాణెం సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం, ముదిరాజ్ వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి, సంక్షేమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



