- Advertisement -
మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు
మేచరాజుపల్లి, సర్పంచ్ తూర్పాటి శంకర్
నవతెలంగాణ-నెల్లికుదురు
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై కరుణాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి నట్లు మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు, మేచరాజుపల్లి గ్రామ సర్పంచ్ తూర్పాటి శంకర్ తెలిపారు. బుధవారం భూకె ఇచ్చి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి నవీన్ రావు, మేచరాజుపల్లి గ్రామ సర్పంచ్ తూర్పాటి శంకర్, పెద్దదండ మాజీ సర్పంచ్ పరమేశ్వర్, పీఏసీఎస్ డైరెక్టర్ కోటగిరి రమేష్, మేచరాజుపల్లి వార్డు సభ్యులు కొత్తూరు విజయ్‌కుమార్, దొడ్ల ఉమా–తిరుపతి, గుగులోత్ స్రవంతి–భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



