Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు
187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించినట్లు ఫోటోగ్రఫీ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు కడారి వెంకటరమణ తెలిపాడు. బుధవారం ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ మండే ట్రగ్యూర్ చిత్రపటానికి పూలమాలలు వేసీ జెండా ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ చాకస్ మండే డాక్యుర్ జ్ఞాపకార్థంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిబోడ నరసింహ, కోశాధికారి గుగులోతు సైదులు,సీనియర్ ఫోటోగ్రాఫర్లుసింగరం నాగేంద్ర ప్రసాద్,బొమ్మ వెంకన్న చారి,అడెంశ్రీధర్, బొమ్మన బోయిన శ్రీకాంత్ యాదవ్,గుగులోతునగేష్,వల్లపు నరేష్,ఇసంపెళ్లి ఉపేందర్,వల్లపు ఐలయ్యమండల ఫోటో వీడియో గ్రాఫర్లు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -