Friday, August 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఐటీయూతోనే సమస్యలు పరిష్కారం

సీఐటీయూతోనే సమస్యలు పరిష్కారం

- Advertisement -

కార్మికులకు అండగా ఉంటూ పోరాటం
పెన్నార్ కార్మికులు సీఐటీయూలో చేరిక : రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

నవతెలంగాణ-పటాన్ చెరు
సీఐటీయూ ద్వారానే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో కార్మికులు సీఐటీయూలో చేరుతున్నారని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కే. రాజయ్య తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్‌లో పెన్నార్ పరిశ్రమ కార్మికులు సీఐటీయూలో చేరారు. ఈ సందర్భంగా కార్మికులకు శాలువాలు కప్పి సీఐటీయూలోకి ఆహ్వానించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ పెన్నార్ పరిశ్రమ కార్మికులు సీఐటీయూలో పలుదఫాలుగా చేరుతున్నారన్నారు. కార్మికులు నమ్ముకున్న ఎర్రజెండా ఎప్పుడూ వారికి అండగా ఉంటుందన్నారు. సీఐటీయూ ద్వారానే కార్మికుల సంక్షేమం సాధ్యమనీ, కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనీ, నిత్యం కార్మికులకు అండగా ఉంటూ పోరాడుతున్న సంఘం సీఐటీయూ మాత్రమేనని అన్నారు. అనేక పరిశ్రమలలో అనేక విజయాలు సాధించిన చరిత్ర సీఐటీయూకు ఉందన్నారు. మెరుగైన వేతన ఒప్పందాలు, సమస్యల పరిష్కారం వంటివి సాధిస్తుందన్నారు. కార్మికులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని సూచించారు. సీఐటీయూలో కార్మికులు రాజ్ కుమార్, రామచందర్, సోమలింగం, రాజు, అంకారావు, రాథోడ్, బాబు, ధర్మారావు, నాయక్, రవీందర్ లు చేరగా ఈ కార్యక్రమంలో సాంబయ్య, ప్రవీణ్ రెడ్డి, హరిహర తదితర కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -