Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు 

జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు 

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం నాడు గ్రామ సర్పంచ్ కర్రేవార్ సావిత్రి సాయా గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాల్యంలో పలు సమస్యలను సామాజికంగా ఎదుర్కోవడం జరిగింది. అంటరానితనం వారిని తనకు జుట్టు కూడా కత్తిరించేవారు లేకపోవడంతో తమ బట్టలను తామే ఉత్తుకోవడం , జుట్టు పెరిగితే తన సోదరులే జుట్టు కత్తిరించే వారిని అంతటి అభాగ్య జీవితం గడిపినారు అని అన్నారు. ఉద్యోగం, విద్యాభ్యాసం, కులవివక్షత, కొరకు ఎనలేని పోరాటాలు చేశారని అన్నారు. దేశంలో ప్రతి రాజకీయ పార్టీపై అంబేద్కర్ ప్రభావం ఉంది. దళిత ఓట్లు దక్కించుకోవడానికి కానీ, సమాజాభ్యుదయం జరగలేదనే విమర్శ ఉంది అని తెలిపారు. అంతకుముందు జిపి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వయసు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు జిపి కార్యవర్గ సభ్యులు, జి పి సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -