Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెన్యువల్ లేదు..అనుభవ సర్టిఫికెట్లపై అనుమానాలు..అయినా విధులు ఎలా.?

రెన్యువల్ లేదు..అనుభవ సర్టిఫికెట్లపై అనుమానాలు..అయినా విధులు ఎలా.?

- Advertisement -

విజిలెన్స్ నివేదికలను పక్కనపెట్టి సిబ్బంది విధులపై విమర్శలు
ఆర్టిఐ ద్వారా డిపార్ట్మెంట్ కు సంబంధం లేదట
నవతెలంగాణ – మల్హర్ రావు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోని డిసిపియులో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది అర్హతలు,సర్టిఫికెట్లపై గతంలో జరిగిన విచారణలో పలు అభ్యంతరాలు, అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.అయినప్పటికీ,సంబంధిత సిబ్బంది ఇప్పటికీ విధులు నిర్వహించడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.గత విచారణలో సిబ్బంది అర్హతలు,సమర్పించిన ధ్రువపత్రాలపై అభ్యంతరాలు వ్యక్తమై,అనర్హత/నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించిన అంశాలు విచారణలో నమోదైనట్లు సమాచారం.అయితే ఆ విచారణను ముందుకు తీసుకెళ్లకుండా ప్రస్తుతం మరో కొత్త విచారణ చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఒకసారి విచారణ నిర్వహించి నివేదిక ఇచ్చిన తరువాత, అదే అంశంపై ఆ విచారణను పక్కనపెట్టి మరో కొత్త విచారణ చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ కార్యకర్త పులిగంటి సుప్రియ పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడారు మూడు సంవత్సరాలుగా రెన్యువల్ లేకుండానే కొంతమంది సిబ్బంది విధులు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల విషయంలో గతంలో విచారణ జరిగినప్పటికీ,అవి నకిలీవని తేలినప్పటికీని వారిని విధుల్లో కొనసాగించడం వెనుక అధికారుల నిర్ణయం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.ఆర్టీఐ ద్వారా గతంలో సంబంధిత సిబ్బందికి శాఖతో సంబంధం లేదని సమాచారం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అర్టీఐలో ఒక సమాధానం.. ఇప్పుడు మరో విధానం.?
మరో ముఖ్యమైన అంశం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా గతంలో ఇచ్చిన సమాచారం. పిఓ (ఏన్ఐసి)కి శాఖతో ఎలాంటి సంబంధం లేదని ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చి, ప్రస్తుతం అదే పిఓ ను సంబంధిత శాఖలో ఏ హోదాలో, ఏ ఉత్తర్వుల ఆధారంగా విధులు నిర్వహిస్తున్నారో వెల్లడించాలనే డిమాండ్ వినిపిస్తోంది.ఒకే అంశంపై ఒక సమయంలో శాఖతో సంబంధం లేదని అధికారిక సమాచారం ఇచ్చి, ఇప్పుడు అదే వ్యక్తికి విధులు అప్పగిస్తే, ఈ రెండు నిర్ణయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధికారులు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది.

అనర్హులపై చర్యలు తీసుకోవాలి
ఇప్పటికే జరిగిన విచారణ నివేదికలను పరిగణనలోకి తీసుకుని,అర్హత లేని వ్యక్తులను విధుల నుంచి తొలగించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్త పులిగంటి సుప్రియ డిమాండ్ చేశారు.విచారణ నివేదికలను పక్కనపెట్టి, అదే అంశంపై మరో విచారణ ద్వారా వ్యవహారాన్ని సాగదీయడం వల్ల పారదర్శకతపై అనుమానాలు ఏర్పడుతున్నాయన్నారు.అర్హతలు, సర్టిఫికెట్లు,రెన్యువల్ విషయంలో నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలని,గత విచారణలో వచ్చిన అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, అనర్హులుగా తేలిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -