నవతెలంగాణ – బజార్హత్నూర్: ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం బజార్హత్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ జాదవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు. కేసీఆర్ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని, అనిల్ జాదవ్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. గత పదేళ్లలో డబుల్ బెడ్రూం ఇళ్లు తీసుకురాని వారు.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లు ఎవరి హయాంలో మంజూరయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. బైక్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్ళెం విఠల్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లెపూల నర్సయ్య, జెల్కే పాండురంగ్, రాథోడ్ రమేష్, బొమ్మెత నర్సయ్య, మునేశ్వర్ నారాయణ, దీసి విజేందర్, గణేష్ జాదవ్, బత్తిని కిషన్, కనిందే మాధవ్, గొల్లనాగు రమేష్, సమ సురేష్‌రెడ్డి, పోరెడ్డి నారాయణ, సయ్యద్ సల్మాన్, శరత్, రాజు, సన్నీ, రవి తదితరులు పాల్గొన్నారు.



