– సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ డిమాండ్
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పదవి ఏ ఒక్క పార్టీకి లేదా వ్యక్తికి సంబంధించింది కాదని, అది ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాసనసభ గౌరవానికి ప్రతీక అని ఆమె స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలను తీవ్రంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండటం సహజమే అయినా, రాజ్యాంగబద్ధ పదవుల పట్ల వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. స్పీకర్‌ను అవమానించడం అంటే శాసనసభ గౌరవాన్ని అగౌరవ పరచడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, శాసనసభ స్పీకర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ డిమాండ్ చేశారు.
స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



