నవతెలంగాణ-మల్హర్ రావు
కాటారం నూతన సబ్ కలెక్టర్‌గా నియమితులైన సౌరబ్ శర్మ సోమవారం ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు మొక్కను అందచేశారు.శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్‌ను కలిసిన సబ్ కలెక్టర్, కాటారం డివిజన్లో పాలనాపరమైన అంశాలు,అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నూతన సబ్ కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాటారం డివిజన్ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండేలా పాలన కొనసాగించాలని కలెక్టర్ సూచించారు.



