Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కరకల సదరు రోడ్డును వేసేందుకు సహకరించాలి

కరకల సదరు రోడ్డును వేసేందుకు సహకరించాలి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల కరకల నుంచి కాపురం నిత్యం పశువులు,రైతులు వెళ్ళడానికి ఇబ్బందులకు గురివుతున్న నేపథ్యంలో రోడ్డు వేయడానికి రైతులు ముందుకు వచ్చారని కానీ ముడుతనపల్లి సంపత్, కుషన మల్లయ్యలు అడ్డుకోవడం జరుగుతుందని వీరిని పిలిపించి రోడ్డు నిర్మాణం అయ్యేలా సహకరించాలని రైతులు సోమవారం సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి, వార్డు సభ్యులకు వినపత్రం అందజేశారు. ఈ రోడ్డు పూర్వకాలం నుంచి ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో ఉందని ఇప్పడు ఇద్దరు అడ్డుకోవడం సరికాదని రైతులు వాపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -