Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చాలి

కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చాలి

- Advertisement -

ప్రజావాణిలో ఎంపీడిఓకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు

కేటీఆర్ పిలుపు, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ 420 హామీలు, 6 గ్యారంటీ లు వెంటనే అమలు చెయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల ఎంపిడిఓకు సోమవారం ప్రజావాణిలో వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటై వెయ్యి  రోజులైన ఇంకా హామీలు అమలు చేయకపోడంపై నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్‌ చైర్మెన్ చెప్యాల రామారావు, బిఆర్ఎస్ మండల నయకుడు బానోతు రాజ్ కుమార్, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, మహిళ, యూత్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -