Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌నేను అనని మాటలను 
స్పీకర్‌‌కు ఆపాదిస్తున్నారు

‌నేను అనని మాటలను 
స్పీకర్‌‌కు ఆపాదిస్తున్నారు

- Advertisement -


బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తాను అనని మాటలను స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌‌కు ఆపాదిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దాడి చేశారని అన్నారు. తన డొక్కలో పోలీసులు పిడిగుద్దులు గుద్దారని చెప్పారు. అయినా తాను ఏం మాట్లాడలేదని వివరించారు. అసహనంతో తాను మాట్లాడిన మాటలను స్పీకర్‌‌ను ఉద్దేశించినట్టు భావిస్తే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని విమర్శించారు. ఈ దాడికి సీఎం, హోంమంత్రి రేవంత్‌‌రెడ్డి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. మిగిలిన విషయాలను తాను మంగళవారం శాసనమండలిలో మాట్లాడతానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -