Tuesday, September 8, 2026
E-PAPER

సభాపర్వం

- Advertisement -

అసెంబ్లీలో బూతుల పర్వం
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

​అసెంబ్లీలో బూతుల పర్వం నడుస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‌వద్ద ఆయన మాట్లాడారు. ఈసారైనా నెల రోజులపాటు అసెంబ్లీ నిర్వహించాలని స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రిని కోరారు. ప్రజల సొమ్ముతో బహిరంగ సభలు పెట్టి కేసీఆర్ ను తిడుతున్నారన్నారు. ఎందుకు కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తడం లేదని ప్రశ్నించారు. 9 గంటల కరెంటు మాత్రమే రైతులకు ఇస్తున్నారని, యూరియా కొరత ఎందుకు వచ్చిందని, ఎందుకు కోటి ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టారని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వ రెవెన్యూ ఎందుకు పెంచలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అసెంబ్లీలో మైకులు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ సమయం మాట్లాడానికి అవకాశం ఇవ్వాలన్నారు.

డ్రామా చేస్తున్న బీఆర్‌ఎస్‌ ‌నాయకులు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
బట్టలు చించుకుని దాడులు జరిగినట్టు బీఆర్ ఎస్‌ ‌నాయకులు డ్రామాలు అడుతున్నారని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడులు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌‌ది అన్నారు. 22ఏపై విచారణ జరిపించాలని బీజేపీ పట్టుబట్టడం సిగ్గు చేటన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం చెప్పినా.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
సభలో బీజేపీ కొత్త డ్రామాలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌
సభ బయట బీఆర్‌ఎస్‌, సభలో బీజేపీ ఎమ్మెల్యేలు సభ సక్రమంగా జరక్కుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్‌ ‌ది పెవికోల్‌ ‌బంధం అన్నారు. పోలీసులపై బీఆర్ ఎస్‌ ‌చేసిన దాడిపై విచారణ జరిపించాలని కోరారు. షర్ట్‌ విప్పి రణరంగం సృష్టించడం హరీశ్‌‌రావుకు తగదన్నారు.
​బీఆర్‌ఎస్‌ ‌పదేండ్ల అవినీతిపై చర్చిద్దాం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బీఆర్‌ఎస్‌ ‌పదేండ్ల అవినీతిపై చర్చిద్దామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రాకుండా కుక్కిన పేనోలే ఫాంహౌస్‌‌లో పడుకున్నారన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ ‌బట్టలను 2028లో విప్పేందుకు రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పారు. రామాలయానికి వచ్చిన రూ.కోట్ల విరాళాలను ఎత్తుకెళ్లిన దొంగలు బీజేపీ నాయకులు అన్నారు. దళిత స్పీకర్‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
​కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి క్షమాపణలు చెప్పాలి ఎమ్మెల్యే డాక్టర్‌ ‌వంశీకృష్ణ
​స్పీకర్‌‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ‌వంశీకృష్ణ అన్నారు. స్పీకర్‌‌కు ఉన్న అధికారాలతో ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకోవాలన్నారు. దళితులను అవమానిస్తే, ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టే అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వం రద్దు చేసి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్‌ఎస్‌‌కు అసలు నాయకుడే లేరు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌
​బీఆర్ఎస్ పార్టీకి అసలు నాయకుడే లేడని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విఫ్‌ అద్దంకి దయాకర్‌ విమర్శించారు. ఇంట్లో కూర్చొని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారన్నారు. దళిత సమాజంపై గౌరవం ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి, తాతా మధు స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. తాత మధుపై మండలి చైర్మెన్‌ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ బూతు రాష్ట్ర సమితి అయ్యిందన్నారు. ‌బీఆర్‌ఎస్‌లో బావ, బామార్దుల మధ్య కోల్డ్‌ ‌వార్‌ ‌నడుస్తోందన్నారు.
పెండింగ్‌ ‌ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ ఎమ్మెల్యే విజయరామారావు
సకాలంలో ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ ఇవ్వక గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెట్టిందని ఎమ్మెల్యే విజయరామారావు అన్నారు. అన్ని అంశాలపైనా చర్చిండానికి సర్కార్‌ ‌రెడీగా ఉంటే ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉండి బీజేపీ నాయకులు రాష్టానికి ఏమీ చేయలేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.
​​ప్రతిపక్షాలు కలిసి కట్టుగా నిరసనలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌‌రెడ్డి
ప్రతిపక్షాలు కలిసి కట్టుగానే అసెంబ్లీ బయట బీఆర్‌ఎస్‌, లోపల ఆందోనళలు చేస్తున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‌వద్ద ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రూ.10లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పారు. 22ఏ పై అసెంబ్లీలో చర్చించేందుకు సర్కార్‌ ‌రెడీగా ఉంటే ప్రతిపక్షాలు కావాలనే ఆందోళన చేస్తున్నాయన్నారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ‌చేయలేని అభివృద్ధిని, ప్రజా ప్రభుత్వం మూడేండ్లలో చేసిందన్నారు. రైతులకు రూ.22వేల కోట్ల రుణమాఫీ చేసినట్టు తెలిపారు.
గత ప్రభుత్వం కంటే రూ.2వేలు ఎక్కువ రైతు భరోసా ఇచ్చామని చెప్పారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయించాలని బీజేపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా.. అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ లోపయికారి ఒప్పందం వల్లనే సభ సజావుగా జరగకుండా కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.
బీఏసీ కమిటీకి ముందే నిరసనలు సరికాదు ఎమ్మెల్యే రాంచందర్‌ ‌నాయక్‌
​బీఏసీ కమిటీ సమాశం జరగక ముందే ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టడం సరికాదని ఎమ్మెల్యే రాంచందర్‌ ‌నాయక్‌ అన్నారు. అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిగితే హరీశ్‌‌రావు, కేటీఆర్‌ భూదందాలు, అక్రమాలు బయటపడతాయనే ఆడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ధరణి, భూభారతిలో జరిగిన అక్రమాలపై చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నా.. డ్రామాలు ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే కేసీఆర్‌‌ను సభకు రప్పించాలని సవాల్‌ ‌విసిరారు.
స్పీకర్‌‌పై దూషణ బాధాకరం ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య
​దళిత స్పీకర్‌ను దూషించడం బాధాకరమని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. వెంటనే తాతా మధుపై చర్యలు తీసుకోవాలి. సెప్టెంబర్‌ 7‌ను బ్లాక్‌ ‌డే పరిగణిస్తామని చెప్పారు.
రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌
వ్యక్తిగత ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో ఎలా పెడుతారని ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌ ప్రశ్నించారు.
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‌వద్ద బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు. 22ఏ వల్ల 50 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ధరణిలో లక్షల ఎకరాలు మాయం అయ్యాయని, వాటిపై చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. ధరణిని అడ్డం పెట్టుకుని ఐఏఎస్‌ ఆఫీసర్లు రూ.వేల కోట్లు సంపాదించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. రూ.15వేల కోట్ల పీజు రీయింబర్స్‌‌మెంట్‌ ‌పెండింగ్‌‌లో ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో పీఎం పంటల బీమాను అమలు చేయాలన్నారు. రాష్ర్టంలో జరిగిన భూదందాపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని కోరుతుంటే ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. గతంలో ధరణి కంటే ఇప్పటి భూ భారతితోనే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
​22ఏ జాబితాలో ఉన్న భూములను తొలగించాలి ​ బీజేపీ ఎమ్మెల్యే ధన్‌‌పాల్‌ ‌సూర్యనారాయణ
22ఏ జాబితాలో ఉన్న భూములను తొలగించి, 22ఏ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ధన్‌‌పాల్‌ ‌సూర్యనారాయణ డిమాండ్‌ ‌చేశారు. ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ ఇవ్వకుండా విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం సెటిల్‌‌మెంట్‌ ‌డబ్బులు ఇవ్వడం లేదన్నారు.
​తాతా మధు రాజీనామా చేయాలి ఎమ్మెల్సీ, ప్రభుత్వ విఫ్‌ ‌బల్మూరి వెంకట్‌
​దళిత స్పీకర్‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే రాజీమానా చేయాలని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విఫ్‌ ‌బల్మూరి వెంకట్‌ డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -