Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరంగారెడ్డి ‘ఏరో స్పేస్‌’ హబ్‌

రంగారెడ్డి ‘ఏరో స్పేస్‌’ హబ్‌

- Advertisement -

అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు డిఫెన్స్‌ ‌రంగంలో ప్రయివేటు కంపెనీలు
శంషాబాద్‌ ‌కేంద్రంగా 
ఏరో టెక్నిక్‌ ‌సంస్థలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

ఏరోస్పేస్, డిఫెన్స్, ఏవియేషన్ రంగాలకు కీలక హబ్‌గా రంగారెడ్డి జిల్లా మారనుంది. విమాన విడిభాగాల తయారీ నుంచి అంతరిక్ష ప్రయాణం వరకూ ఎదిగింది. ఏరో స్పేస్‌ ‌రంగంలో విమాన విడిభాగాల తయారీ మొదలు.. ఏరో టెక్నిక్‌ అంతర్జాతీయ ‌సంస్థలు ఇక్కడ వెలిచాయి. రంగారెడ్డి జిల్లా కేంద్రంగా ప్రపంచ దేశాల్లోని ఏరో స్పేస్‌ కదలికలను, ఎయిర్‌ క్రాఫ్ట్‌ ‌మరమ్మతులను చేపడుతుంది. ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచి విమానాయ విడివిభాగాలు, మిసైల్స్‌, డ్రోన్లు, విమాన ఇంజన్లు ఎగుమతులు అవుతున్నాయి. దేశంలో మొదటి సారిగా శంషాబాద్‌ ‌కేంద్రంగా ‘స్కైరూట్‌ ఏరో స్పేస్‌’ ప్రయివేట్‌ ‌స్పేస్‌ ‌టెక్‌ ‌యూనికార్న్‌ ఏర్పడింది. ప్రస్తుతం ఎడ్యుకేషన్‌, ఐటీ, పారిశ్రామిక హబ్‌గా పేరొందిన రంగారెడ్డి జిల్లా ‘ఏరో స్పేస్‌ ‌హబ్‌’గానూ అవతరించనుంది.
రంగారెడ్డి జిల్లాలో జీఎమ్‌ఆర్‌ ఏరో స్పేస్‌ శంషాబాద్ విమానాశ్రయం, అదిభట్ల, మహేశ్వరం, బాలాపూర్, నాదర్‌గుల్ ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటైన పారిశ్రామిక మౌలిక వసతులు ఈ రంగానికి మరింత ఊతమిస్తున్నాయి. అదిభట్లలో ఏరోస్పేస్ ఎస్‌ఈజెడ్ 339.10 ఎకరాల్లో విస్తరించి ఉంది. రంగారెడ్డి జిల్లా ఏరోస్పేస్ రంగంలోకి ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షిస్తోంది. అదిభట్ల ఏరోస్పేస్ ఎస్‌ఈజెడ్‌లో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, టాటా బోయింగ్ ఏరోస్పేస్ వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విమానాల విడిభాగాలు, ఏరోస్ట్రక్చర్స్, డిఫెన్స్ వ్యవస్థల తయారీకి ఈ ప్రాంతం కేంద్రంగా మారింది. శంషాబాద్ పరిసరాల్లో జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఈ ఎకోసిస్టమ్‌‌కు మరో కీలక కేంద్రంగా ఉంది. ఇక్కడ స్కైరూట్ ఏరోస్పేస్, సఫ్రాన్, ఇతర ఏవియేషన్, ఏరోస్పేస్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు
జిల్లాలో ప్రస్తుతం ఐదు అంతర్జాతీయ ఏరో స్పేస్‌ ‌సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీలు అంతర్జాతీయ ఎగుమతులు చేపడుతున్నాయి. ఏడాదిలో సుమారు రూ.లక్షల కోట్ల ఎగుమతులు చేపడుతున్నట్టు ఇండస్ర్టియల్‌ అధికారులు చెబుతున్నారు. టాటా అడ్వాన్స్‌ ‌సిస్టం, ఏరో స్పేస్‌, సాఫ్రాన్‌ ఏరో స్పేస్‌, జీఎమ్‌ఆర్ ఎమ్‌ఆర్‌‌వో టెక్నికల్‌ ‌సంస్థ, సాఫ్రాన్‌ ఎమ్‌ఆర్‌‌వో ఇన్‌‌జిన్‌ ‌సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్నాయి. జీఎమ్‌ఆర్‌ ఎమ్‌‌ఆర్‌‌వో (ఎయిర్‌ ‌ప్రేమ్‌ ‌మెయింట్‌‌నెన్స్‌ ‌రిపేర్‌ అండ్‌ ఓవర్‌‌హల్‌) ‌సాఫ్రాన్‌ ఏరో స్పేస్‌ ఎమ్‌ఆర్‌‌వో ఈ సంస్థలు విమానాలు, యుద్ధ విమానాలు, జల మార్గంలో ప్రయణించే యుద్ధ విమానాల ప్రయాణ కదిలికలను గమనిస్తూ.. ఎప్పటికప్పుడూ వాటి మరమ్మతులను చేపడుతున్నాయి. ఇందులో ‌సాఫ్రాన్‌ ఏరో స్పేస్‌ ‌ప్రపంచ స్థాయిలో అతిపెద్ద ఎమ్‌ఆర్‌‌వో కంపెనీగా ఉంది. ఇది రంగారెడ్డి జిల్లా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందిస్తోంది.
ప్రపంచ దేశాలకు ఎగుమతులు
టాటా ఏరో స్పేస్‌, సాఫ్రాన్‌ ఏరో స్పేస్‌, అదానీ ఏరోస్పేస్‌, మహేంద్ర టెక్‌ ఏరో స్పేస్‌ పెద్ద ఎత్తున్న అమెరికా, ఆఫ్రికా ఖండాలకు ఎగుమతులు చేపడుతున్నాయి. టాటా ఏరో స్పేస్‌ ‌బోయింగ్‌, విమాన క్యాబిన్లు, ఇంజన్‌ ‌విడిభాగాలు తయారు చేస్తుంది. సాఫ్రాన్ ఏరో స్పేస్‌ ఎయిర్‌ ‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. అదానీ ఏరో స్పేస్‌ ఇజ్రాయిల్‌‌కు డ్రోన్లు ఎగుమతి చేస్తుంది. డిఫెన్స్‌ ‌రంగంలో కొన్ని కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థలకు విడిభాగాలు అందిస్తున్నాయి.

రూ.453 కోట్లతో మరో భారీ అడుగు
ఏరోస్పేస్ రంగంలో జిల్లాకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. మహేశ్వరం హార్డ్‌వేర్ పార్క్‌లో ఐటీపీ ఏరో సంస్థ రూ.453 కోట్లతో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల శంకుస్థాపన జరిగింది. దీంతో విమాన ఇంజిన్లకు సంబంధించిన అత్యాధునిక విడిభాగాల తయారీ రంగంలో రంగారెడ్డి ప్రాధాన్యం మరింత పెరగనుంది. ఇలాంటి పెట్టుబడులతో పెద్ద సంస్థలే కాకుండా వాటికి విడిభాగాలు, సబ్ అసెంబ్లీలు, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్స్ సరఫరా చేసే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా అవకాశాలు పెరగనున్నాయి. ​ఏరోస్పేస్ పరిశ్రమ విస్తరణతో ఇంజినీరింగ్, డిప్లొమా, ఐటీఐ, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, వెల్డింగ్ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్న వారికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏరోస్పేస్ రంగానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, స్టార్టప్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది.

స్పేస్‌ హబ్‌గా రంగారెడ్డి జిల్లా మారనుంది
రంగారెడ్డి జిల్లాలో ఏరో స్పేస్‌ ‌సంస్థలు పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచంలో నెంబర్‌ ‌వన్‌ ఏరో స్పేస్‌ ‌సంస్థ సాఫ్రాన్‌ జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు చేపడుతోంది. మాన్యుఫ్యాక్షరింగ్‌ ‌కాకుండా, ఎయిర్‌ ప్రేమ్‌ ‌మెయింటెనెన్స్‌ ‌రిపేర్‌ అండ్‌ ఓవర్‌‌హల్‌ కార్యక్రమాలు చేపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరగుతున్నాయి. భవిష్యత్‌‌లో రంగారెడ్డి జిల్లా స్పేస్‌ ‌హబ్‌గా మారనుంది.
శ్రీలక్ష్మి, జిల్లా ఇండస్ర్టియల్‌ ‌జనరల్‌ ‌మేనేజర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -