పరిస్థితి విషమం
నవతెలంగాణ- నర్సంపేట
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన డ్రైవర్ బోలా శంకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానిక ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర కలకలం రేపింది. గురువారం వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఎదుట సమ్మె శిబిరం వద్ద డ్రైవర్ బోలా శంకర్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లోనే హాహాకారాలతో శంకర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అక్కడే ఉన్న తోటి కార్మికులు వెంటనే మంటలను ఆర్పేశారు. పోలీసుల సహకారంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శంకర్ శరీరం 60 శాతం కాలిపోయినట్టు వైద్యులు చెప్పారు. అతని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. డిపో వద్ద ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.
నర్సంపేట డిపో ఎదుట పెట్రోల్ పోసుకున్న డ్రైవర్ శంకర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



