Friday, April 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమ్మె విరమించండి

సమ్మె విరమించండి

- Advertisement -

– చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
– ఆర్టీసీ కార్మికులకు క్యాబినెట్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. కార్మికులు సంయమనం పాటించాలనీ, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపింది. ”మీ సమస్యలను పరిష్కరించాలనే సానుకూల వైఖరితోనే ప్రభుత్వం అధికారుల కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావుతో ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ చర్చలకు రావాలని కార్మిక సంఘాలను కోరుతున్నాం. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రాణాలు తీసుకోవడం సరికాదు. ఇది మీ ప్రభుత్వం…. నమ్మకంతో ఉండండి” అని క్యాబినెట్‌ ఆర్టీసీ కార్మికులకు సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -